: రుచి చూసినందుకే హోటల్ వెయిటర్ ప్రాణం పోయింది!


ముంబైలోని ఖర్ ప్రాంతంలో ఉన్న యెల్లో అనే ఇటాలియన్ బార్ అండ్ రెస్టారెంట్ లో మణిపూర్ కి చెందిన హుస్సేన్ (34) అనే వ్యక్తి వెయిటర్ గా పని చేస్తున్నాడు. ఇక్కడ సర్వ్ చేసే రకరకాల మద్యానికి బాగా డిమాండ్ ఉంది. బుధవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ వైన్ టేస్టింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో భాగంగా కెప్టెన్ ట్రైనింగ్ లో ఉన్న హుస్సేన్ 12 బ్రాండ్ల మద్యాన్ని ఒకేసారి రుచి చూశాడు. వర్క్ షాప్ అయిపోయిన కొద్ది సేపటికి హుస్సేన్ హోటల్ గేట్ దగ్గర పడిపోయి సహచరులకు కన్పించాడు. హోటల్ సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మద్యంలోని రసాయనాల వల్లే ఆయన మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నివేదిక చెబుతోందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాకే కేసు ఓ కొలిక్కి వస్తుందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News