: రాశి ఖన్నా, రెజీనా...హీరోలంతా నాకు ఫ్రెండ్సే: రకుల్ ప్రీత్ సింగ్


సినిమా హీరోయిన్లలో రాశిఖన్నా, రెజీనా తనకు మంచి స్నేహితులని అందాలబొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. 'స్పీడున్నోడు' సినిమా ఆడియో వేడుక సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హీరోలంతా తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే వీలుండదు కనుక, ఆ ఒత్తిడిని జయించేందుకు స్నేహితులతో గడపడం అవసరమని పేర్కొంది. సినీ పరిశ్రమలో వీరితో తాను ఎక్కువ స్నేహంగా ఉంటానని రకుల్ తెలిపింది. నటులంతా తన స్నేహితులేనని, అందరం సరదాగా కలుసుకుని, సంతోషంగా గడుపుతామని రకుల్ చెప్పింది.

  • Loading...

More Telugu News