: విరాట్ ను విమర్శించలేదు...పొగిడాను: మ్యాక్స్ వెల్
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను విమర్శించానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తెలిపాడు. సిడ్నీలో మ్యాక్స్ వెల్ ట్విట్టర్ ద్వారా కోహ్లీ ఆటతీరుపై స్పందించాడు. నాలుగో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అన్నాడు. ఒక దశలో మ్యాచ్ మొత్తాన్ని విరాట్ తన చేతుల్లోకి లాగేసుకున్నాడని మ్యాక్స్ పేర్కొన్నాడు. భారీ స్కోరు చేసినా ఓడిపోతామని భావించానని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిలో అద్వితీయ పోరాట పటిమతో మ్యాచ్ ను కొనసాగించాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ టీమిండియా గెలుచుకుని ఉండేదని పేర్కొన్నాడు. తనకు తెలిసిన ప్రపంచంలో అలాంటి ఆటతీరును ఎవరూ ప్రదర్శించలేరని మ్యాక్స్ వెల్ తెలిపాడు. అతను క్రీజులో ఉన్నంత సేపు ఎలా కట్టడి చేయాలో బౌలర్లకు అర్థం కాలేదని మ్యాక్స్ వెల్ వెల్లడించాడు. గాయం కారణంగా చివరి వన్డేకు మ్యాక్స్ వెల్ దూరమైన సంగతి తెలిసిందే.