: అతని ఒళ్లంతా పాము కాట్లే...ఇప్పుడు పాము కరిచినా అతనికేమీ కాదు!


మానవాళి కోసం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. అలాంటప్పుడే శాస్త్రవేత్తల్లోని ప్రతిభ వెలుగు చూస్తుంది. అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త టిమ్ ఫ్రేదే కూడా అలాంటి మొండి పట్టుదల గల మనిషే. పాము కాటు వల్ల సంభవించే మరణాలను నివారించేందుకు పాము విషంతోనే మనుషులకు పనికొచ్చే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఆయన నడుం బిగించాడు. ఈ పరిశోధనలు చేసేందుకు ఔత్సాహికులు లభించే అవకాశం లేకపోవడంతో ఆయన బ్లాక్ మాంబా, టైపాన్ లాంటి అత్యంత విషపూరితమైన పాములతో వందల సార్లు తన శరీరంపై కరిపించుకున్నాడు. దీంతో ఆయన చాలాసార్లు మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఈ పరిశోధనల సందర్భంగా ఆయన పాములతో కరిపించుకోవడం చూసి తట్టుకోలేకపోయిన అతని భార్య, అతనిని విడివెళ్లిపోయింది. అయినప్పటికీ ఆయన తన పరిశోధనలు ఆపలేదు. 16 ఏళ్లుగా ఈ పరిశోధనలు సాగిస్తున్న టిమ్ లో ఇప్పుడు ఆ విషమే రోగనిరోధక శక్తిగా పనిచేస్తోంది. మానవ శరీరంలో ఉండాల్సిన యాంటీ బాడీస్ కంటే రెట్టింపు ఆయనలో ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టు డాక్టర్ బ్రయాన్ హాన్లే తెలిపారు. పాము విషంతోనే పాముకాటుకి వ్యాక్సిన్ తయారుచేసి, తన కలను నిజం చేసుకునే పనిలో ఇప్పుడు ఆ శాస్త్రవేత్త అహరహం నిమగ్నమయ్యాడు.

  • Loading...

More Telugu News