: రోజర్ ఫెదరర్ 'మూడొందల గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచ్ ల' ఘనత


ప్రముఖ టెన్నిస్ ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తాజాగా ఓ రికార్డు సృష్టించాడు. మూడు వందల గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచ్ లను గెలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇవాళ మెల్ బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా స్టేడియంలో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ లో 6-4, 3-6, 6-1, 6-4 తేడాతో బల్గేరియా ఆటగాడు గ్రిగోర్ దిమిత్రోవ్ పై ఫెదరర్ గెలిచాడు. దాంతో నాలుగవ రౌండ్ లోకి ప్రవేశించి అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచుల్లో విజేతగా నిలిచిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఫెదరర్ 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలిచిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News