: మిలిటెంట్ల రహస్య స్థావరం కనుగొన్న మరాఠా రెజిమెంట్
జమ్మూకాశ్మీర్ లోని ఉత్తర కుప్వారా జిల్లాలో అమ్రోహి అటవీ ప్రాంతంలో మిలిటెంట్ల రహస్య స్థావరాన్ని మరాఠా రెజిమెంట్ కనుగొంది. 12 మరాఠా రెజిమెంట్ కు చెందిన సైనికాధికారులు భారత నియంత్రణ రేఖ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మిలిటెంట్లకు చెందిన రహస్య స్థావరం పట్టుబడింది. ఈ సందర్భంగా ఐదు ఐఈడీలు, 35 మీటర్ల వైరు, 3 డిటోనేటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థావరం దగ్గర ఆర్మీ అధికారులను మట్టుబెట్టేందుకు మిలిటెంట్లు వీటిని అమర్చినట్టు వారు పేర్కొన్నారు. సైన్యం చేపట్టిన తనిఖీల వల్ల ఈ రహస్య స్థావరం బట్టబయలైందని వారు వెల్లడించారు.