: పేపర్ మిల్లులు ఐదురోజుల పాటు బంద్!


ముడి సరుకుల ధరలు బాగా పెరిగిపోవడంతో పేపర్ మిల్లులను ఐదురోజుల పాటు బంద్ చేస్తున్నట్లు ఉత్తర భారతదేశం పేపర్ మిల్లుల సంఘం అధ్యక్షుడు పంకజ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలోని సుమారు 130 పేపర్ మిల్లులు ఈ బంద్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ బందును ఈ రోజు నుంచే ప్రారంభించినట్లు చెప్పారు. షామ్లి, ఘజియాబాద్, మీరట్, మొరాదాబాద్, రూర్కీ, కాశీపుర్ మొదలైన నగరాల్లోని పేపర్ మిల్లుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించామని, ఆ తర్వాతే మూసివేత నిర్ణయం తీసుకున్నామని పంకజ్ అగర్వాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News