: టీఆర్ఎస్ వంద సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: షబ్బీర్ అలీ


జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నేతలు ఒకరిని మించి మరొకరు సవాళ్లు చేస్తున్నారు. ఆ మధ్య టీఆర్ఎస్ వంద సీట్లు గెలవకుంటే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇలాగే సవాల్ చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలిస్తే గనుక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఒకవేళ గెలవకుంటే మంత్రి కేటీఆర్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే అర్హత ఎంఐఎంకు లేదన్నారు. హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని సూటిగా అడిగారు.

  • Loading...

More Telugu News