: రోహిత్ తల్లికి స్మృతి ఇరానీ ఫోన్!
ఆత్మహత్యకు పాల్పడ్డ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ తల్లికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కొద్ది సేపటి క్రితం ఫోన్ చేశారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కేసు విషయమై న్యాయ విచారణ నిర్వహిస్తామని, న్యాయం చేస్తామని రోహిత్ తల్లి రాధికకు ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఉత్తరప్రదేశ్ లక్నోలోని అంబేద్కర్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ.. రోహిత్ ఆత్మహత్య విషయాన్ని ప్రస్తావించారు. భారతదేశం ఒక ముద్దుబిడ్డను కోల్పోయిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే, మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల అనంతరం రోహిత్ తల్లికి మంత్రి స్మృతి ఇరానీ ఫోన్ చేయడం గమనార్హం.