: టీఆర్ఎస్ మాటలు నమ్మకండి: టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. కేసీఆర్ వైఖరి కారణంగానే కేంద్రంలో తెలంగాణకు తగిన ఆదరణ లభించడం లేదని అన్నారు. గ్రేటర్ హైదరాబాదును మరింత గొప్పగా తీర్చిదిద్దాలంటే కేంద్రం సహకారం అవసరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదు ఆదాయాన్ని ఖర్చు చేయడానికే చూస్తుందని ఆయన ఆరోపించారు. అలా కాకుండా హైదరాబాదు ద్వారా లభించే ఆదాయంతో జీహెచ్ఎంసీని అంతర్జాతీయ స్ధాయిలో తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు. ఇక కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అధికారంలో ఉండే కేసీఆర్ గ్రేటర్ హైదరాబాదుకు చేసేదేమీ లేదని, టీఆర్ఎస్ నేతలు చెప్పే అబద్ధాలను ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు.