: నిజాం వాడిన పేపర్ వెయిట్ ఖరీదు వెయ్యి కోట్లు!


నిజాం పాలకులకు, వజ్రాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం నుంచి మరెన్నో వజ్రాలు నిజాం ప్రభువుల నుంచి చేతులు మారినవే. నిజాం రాజులు అప్పట్లో అత్యంత విలువైన జాకబ్ డైమండ్ ను పేపర్ వెయిట్ గా వాడేవారు. దక్షిణాఫ్రికా వజ్రాల గనుల్లో దొరికిన విలువైన వజ్రాన్ని యూరోపియన్ వ్యాపారులు 1891లో ఆరో నిజాం వద్దకు తీసుకుని వచ్చి అమ్మకానికి పెట్టారు. అయితే బేరం కుదరలేదు. దీంతో ఈ వజ్రం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు అప్పటి వజ్రాల వ్యాపారి మాల్కం జాకబ్ ను రంగంలోకి దించారు. ఆయన మధ్యవర్తిత్వంతో 46 లక్షలు ఇస్తానంటూ ఆరోనిజాం ఆఫర్ ఇచ్చాడు. ఇది నచ్చని వ్యాపారులు మరింత మంచి ధర చెప్పాలని కోరారు. దానికి నిజాం అంగీకరించకపోవడంతో వివాదం రేగింది. దీంతో ఈ వ్యవహారం న్యాయస్థానానికి వెళ్లింది. దీంతో న్యాయస్థానం ఆ వజ్రానికి 23 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తం చెల్లించి, సొంతం చేసుకున్న నిజాం, వివాదం కారణంగా దానిపై ఇంట్రెస్టు చూపించలేదు. అయితే మాల్కం జాకబ్ కారణంగా తనకు చేరినందున దానికి 'జాకబ్ డైమండ్' అని పేరు పెట్టాడు. నిజాం మరణించిన కొన్నేళ్లకు ఆయన కుమారుడు ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వజ్రాన్ని తన తండ్రి షూలో దీనిని గుర్తించాడు. షూలోంచి దీనిని తీయించి పేపర్ వెయిట్ గా వాడుకున్నాడు. గ్రేట్ వైట్ డైమండ్ గా నీరాజనాలు అందుకున్న దీని బరువు సానబెట్టక ముందు 400 క్యారెట్స్ (80 గ్రాములు) ఉండగా, సానబెట్టిన తరువాత 184.5 క్యారెట్స్ (36.90 గ్రాములు) ఉంది. భారత ప్రభుత్వాధీనంలో ఉన్న ఈ వజ్రం ధర ప్రస్తుతం వెయ్యి కోట్లకు పైమాటే.

  • Loading...

More Telugu News