: అత్యాచార నేరానికి.. చెంపదెబ్బల శిక్ష...!
అత్యాచార నేరానికి పాల్పడ్డవారికి యూపీలోని బాగ్ పట్ ప్రాంతంలో శిక్ష ఏమిటో తెలుసా? కేవలం చెంపదెబ్బలు మాత్రమే. ఆ గ్రామ పంచాయతీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాగ్ పట్ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల బాలికపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరం బాధితురాలి కుటుంబం ముగ్గురు నిందితులను గ్రామ పంచాయతీ పెద్దల ముందు నిలబెట్టింది. ఒక్కొక్క నిందితుడికి ఐదు చెంపదెబ్బలు చొప్పున శిక్ష విధించారు. ఇదేమి శిక్ష? అంటూ బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. కాగా, ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.