: సరి-బేసి విధానం ఆపేశాక... ఢిల్లీలో కాలుష్యం పెరిగింది


వాయు కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీలో 15 రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సరి-బేసి విధానం బాగానే విజయవంతమైంది. ఆ పదిహేను రోజుల్లో కాలుష్యం గతంలో కంటే ప్రధాన సమయాల్లో కొంతవరకు తగ్గింది. కానీ ఈ విధానం ఆపివేసిన తరువాత మొదటి మూడు పనిదినాల్లో కాలుష్య స్థాయి ఒకేసారి పెరిగిపోయిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ వెల్లడించింది. మొదటి పనిదినంలో ఫైన్ పార్టిక్యులేట్ మాటర్ (పీఎం2.5) స్థాయి అధికంగా 57 శాతం పెరిగిందని వివరించింది. ఈ నేపథ్యంలో మిగతా శీతాకాలానికి కూడా సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని, ట్రాఫిక్ తగ్గించాలని ఆ సంస్థ కోరింది. అయితే ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగుపరిచి ఈ విధానం అమలు చేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News