: చెవిరెడ్డి, మిధున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది: లోకేశ్
వైకాపా నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిధున్ రెడ్డిల అరెస్టు వెనుక తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. చెవిరెడ్డిపై గతంలోనే కేసు నమోదైందని, ఆ కేసు ఫలితంగానే ఆయన అరెస్టయ్యారని తెలిపిన లోకేశ్, దానితో తమకు ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, మిధున్ రెడ్డి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో మిధున్, అక్కడి మేనేజరుపై దాడి చేసిన దృశ్యాలు బయటపెడితే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన జగన్, మాటకు కట్టుబడి వుంటారా? అని లోకేశ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకూ దిగడం లేదని అన్నారు.