: విజయయాత్రకు సిద్ధమవుతున్న‘డిక్టేటర్’ బృందం!
సంక్రాంతి కానుకగా విడుదలైన డిక్టేటర్ చిత్రం సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా, అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి బాలయ్య అభిమానులు ఆయనను కలవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిక్టేటర్ చిత్ర బృందమే స్వయంగా వెళ్లి అభిమానులను కలవనుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ, ‘ఈ విషయమై బాలయ్య బాబు, నేను కలిసి డిస్కస్ చేశాము. డిక్టేటర్ సక్సెస్ ను షేర్ చేసుకునేందుకు జనంలోకి మనమే వెళ్దామని బాలయ్య బాబు అన్నారు. 22వ తేదీన వైజాగ్ వెళ్తాం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకుంటాం. తర్వాత విజయవాడ, మహబూబ్ నగర్ వెళ్తాము. థియేటర్ల దగ్గరే అభిమానులందరినీ కలుస్తాం. మమ్మల్ని కలవాలని అనుకునే అభిమానులు అక్కడికి వస్తారని అనుకుంటున్నాము. ఈ టూర్ సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.