: సైకిలెక్కిన ఆర్నాల్డ్... బెదిరిపోయిన ప్రజలు!


ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్... తన టర్మినేటర్ సిరీస్ చిత్రాలతో ఇండియాలో సైతం అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్. పర్యావరణానికి సహకారం అంటూ సైకిలెక్కి బ్రిటన్ లోని ఎడిన్ బర్గ్ రహదారులపై చక్కర్లు కొట్టాడు. అంతవరకూ బాగానే ఉంది. ఎటెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతూ, అధికారులను, ప్రజలను బెదరగొట్టాడట. తాను బస చేసిన హోటల్ నుంచి బయటకు వచ్చి, ఓ అద్దె సైకిల్ తీసుకుని అత్యంత బిజీగా ఉన్న లోథియన్ రహదారిలోకి వెళ్లి, ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ అటూ ఇటూ తిప్పుతుండటంతో, కొందరు ప్రజలు ప్రమాదకరమని కూడా హెచ్చరించారట. తలకు హెల్మెట్ లేకుండా ఆర్నాల్డ్ తిరుగుతూ ఉండటాన్ని కొందరు పోలీసు అధికారులు ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆయనపై ఎలాంటి ఫైన్ వేయలేదు గానీ, ఈ తరహా చర్యలు బాధ్యతారాహిత్యమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు తాను సరదాగా చేసిన సైకిల్ యాత్ర బాగుందని ట్విట్టర్ ఖాతా ద్వారా ఆర్నాల్డ్ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

  • Loading...

More Telugu News