: యూరియా, డీఏపీ ధరలు ఇప్పట్లో పెంచం: కేంద్ర మంత్రి హన్స్ రాజ్


దేశంలో యూరియా, డీఏపీ ధరలను మరో నాలుగు సంవత్సరాలు వరకు పెంచేదిలేదని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులను మంత్రి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగానే ఆయన పై విషయాన్ని వెల్లడించారు. రామగుండంలో మరో బొగ్గు ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో దేశంలోని 16 కోట్ల మంది రైతులకు భూసార పరీక్షల కార్డులు అందజేస్తామని తెలిపారు. ఫిబ్రవరి రెండోవారంలో ప్రధాని చేత రామగుండం ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేయిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News