: తెలంగాణలో ఏళ్లుగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై వడ్డీ మాఫీ


తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై వడ్డీ (సర్ చార్జీ)ని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, గృహ వినియోగదారులకు మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తించనుంది. ముఖ్యంగా రూ.కోట్లలో బకాయిపడిన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కలసి వచ్చే అవకాశం ఉంది. గృహ వినియోగదారులకు కూడా ఇది మంచి అవకాశమని విద్యుత్ అధికారులు చెబుతుండగా, వచ్చే మార్చి 31 వరకు ఏక మొత్తంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తించనుంది.

  • Loading...

More Telugu News