: ‘ఉగ్ర’ వేటలో ఎన్ఐఏ... దేశవ్యాప్తంగా 25 మంది అనుమానితుల అరెస్ట్


గణతంత్ర వేడుకల్లో బీభత్సం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారు. అయితే నిఘాలో కాస్తంత అప్రమత్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశారు. ఐబీ హెచ్చరికలతో వేగంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను రంగంలోకి దించింది. ఐబీ అధికారులకు చేరిన కీలక సమాచారాన్ని చేతబట్టుకుని ఎన్ఐఏ అధికారులు దేశంలోని పలు ప్రధాన ప్రాంతాలకు బృందాలుగా బయలుదేరారు. నేటి తెల్లవారుజామున బెంగళూరులో మొదలైన అరెస్ట్ ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో నలుగురు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాదు, ముంబై నగరాలతో పాటు రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు మొత్తం 25 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News