: ఢిల్లీలో హై అలర్ట్... పఠాన్ కోట్ నుంచి ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలోకి ఎంటరయ్యారట!


దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగర వాసులంతా అత్యంత జాగ్రత్తగానే కాక అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అసలు విషయమేంటంటే... ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ తరహాలో ఈ నెల 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలపై విరుచుకుపడేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పక్కాగా స్కెచ్ వేశారట. ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ సహా దేశంలోని అన్ని నగరాల్లోనూ భద్రత కట్టుదిట్టమైంది. తాజాగా నేటి ఉదయం పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీ నగరంలోకి ఎంటరయ్యారట. పఠాన్ కోట్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు సదరు వ్యక్తులు వినియోగించిన కారుకు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తిని వారు చంపేశారట. దీంతో సదరు ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఉగ్రవాదులుగానే అనుమానిస్తున్నారు. డ్రైవర్ హత్యపై పక్కా సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఓ వైపు ఘటనా స్థలికి కొందరిని పంపి, ఢిల్లీలోకి ఎంటరైన వ్యక్తుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News