: శత్రువులు అక్కర్లేదు... మనల్ని మనమే చంపుకుంటాం: పాక్ విద్యార్థినుల అభిప్రాయం
"పాకిస్థాన్ ను నాశనం చేసేందుకు ఏ శత్రు దేశమో అవసరం లేదు. మనల్ని మనమే చంపుకుంటాం. ఉగ్రవాదం అంతలా పెరిగిపోయింది" ఈ వ్యాఖ్యలన్నది ఎవరో తెలుసా? పాక్ లో పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక. ఆ పాఠశాలలో చదువుకుంటున్న మిగతా బాలికలదీ ఇదే విధమైన అభిప్రాయం. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి కల్పించలేని ప్రభుత్వం అణు పరీక్షలు ఎందుకు చేయాలని మరో బాలిక ప్రశ్నించింది. భారత్, పాక్ లు ఒకేసారి విడిపోతే, ఇండియా ఎందుకు అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుకు సాగుతోంది? పాక్ ఎందుకు ఇలా మారిందని మరో బాలిక ప్రశ్నించింది. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనాయని కూడా బాలికలు ఆరోపించారు. కాగా, 2011లో ఈ వీడియో రికార్డ్ అయినట్టు తెలుస్తుండగా, బచా ఖాన్ యూనివర్శిటీపై ఉగ్రవాదుల దాడి అనంతరం మరోసారి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చి వైరల్ అవుతోంది.