: కృష్ణాజిల్లా కంకిపాడు ఘటనలో నిందితుల అరెస్టు


కృష్ణాజిల్లా కంకిపాడు ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అన్నాచెల్లెళ్లపై దాడిచేసి, అన్న మరణానికి కారకులైన రామ్ ప్రసాద్, వెంకన్న, వెంకటేశ్వరరావు అనే యువకులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఈ నెల 19న అన్నాచెల్లెళ్లయిన దేవరపల్లి రవితేజ, స్వప్న ఓ కార్యక్రమానికి హజరై తిరిగివస్తుండగా కంకిపాడు మండలం పునాదిపాడులో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు చెల్లిపై అత్యాచార యత్నానికి తెగబడ్డారు. అడ్డుకున్న సోదరుడు రవితేజను నిందితులు బైక్ తో ఢీకొట్టడంతో గాయాలపాలై ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

  • Loading...

More Telugu News