: కడప జిల్లాలో డ్రగ్స్ రాకెట్... రాయచోటిలో రూ.5 కోట్ల కొకైన్ స్వాధీనం
యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్ ఎక్కడంటే అక్కడ దొరికిపోతున్నాయి. అక్రమ మార్గాల్లో దేశంలోకి వచ్చేస్తున్న మాదక ద్రవ్యాలు నగరాల నుంచి చిన్న పట్టణాలకు కూడా గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతున్నాయి. కడప జిల్లా రాయచోటిలో నిన్న పోలీసులు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు రాయచోటి పోలీసులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసి డ్రగ్స్ విక్రయిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.5 కోట్ల విలువ చేసే కిలో కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి దాకా కొకైన్ చేరిన వైనంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.