: మెదక్ జిల్లా వ్యవసాయ శాఖలో నిధుల గోల్ మాల్... రూ.1.03 కోట్లు తిన్న కంప్యూటర్ ఆపరేటర్
మెదక్ జిల్లా వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మానయ్య అనే వ్యక్తి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల ఫోర్జరీ సంతకాలతో అతడు ఏకంగా రూ.1.03 కోట్లను స్వాహా చేశాడు. కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు, అతడు స్వాహా చేసిన మొత్తాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు. కొంతకాలంగా అక్రమాలకు తెర తీసిన మానయ్య, గుట్టుచప్పుడు కాకుండా తన చేతివాటాన్ని యథేచ్ఛగా కొనసాగించాడు. కాస్త ఆలస్యంగా అతడి మోసాన్ని గుర్తించిన ఆ శాఖ అధికారులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మానయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.