: బీసీసీఐని ఆశ్రయించిన పాకిస్థానీ క్రికెటర్... నిషేధం తొలగింపుపై సాయం కోరుతున్న కనేరియా!


పాకిస్థాన్ క్రికెటర్ డానిష్ కనేరియా బీసీసీఐని ఆశ్రయించాడు. ఇంగ్లిష్ కౌంటీల్లో కనేరియా ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిపై ఐదేళ్ల నిషేధం పడింది. ఇదే సమయంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో సస్పెన్షన్ కు గురైన ముగ్గురు పాకిస్థానీ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ లో పునరాగమనం చేసేందుకు పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించిది. అదే సమయంలో కనేరియాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తనపై నిషేధం ఎత్తివేసేలా చూడాలని కనేరియా మన బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఐసీసీతో మాట్లాడి, సస్పెన్షన్ నుంచి విముక్తి కల్పించాలని ఈ క్రికెటర్ బీసీసీఐని కోరాడు. తన ఆర్థిక పరిస్థితి క్షీణించినందున ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విధించిన జరిమానాను చెల్లించలేని స్థితిలో ఉన్నానని కనేరియా స్పష్టం చేశాడు. ఈ నిషేధంపై సవాల్ చేసి, తమను కోర్టుకు లాగినందుకుగాను అయిన ఖర్చులు కలుపుకుని కనేరియా 2.5 కోట్ల రూపాయలు చెల్లించాలని జరిమానా విధించింది. దీంతో తాను మరిన్ని కష్టాల్లో ఉన్నట్టు కనేరియా తెలిపాడు. మరి, ఈ పాక్ క్రికెటర్ విన్నపంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి!

  • Loading...

More Telugu News