: 70 ఎకరాల షాపింగ్ మాల్...ఈగలు తోలుకుంటోంది!
70 ఎకరాల షాపింగ్ మాల్ లో దుకాణాలు లేకపోవడమేంటనే అనుమానం వచ్చిందా? అవునండీ నిజం. అమెరికాలోని పెంటగాన్ (దేశ రక్షణశాఖ ప్రధాన కార్యాలయం)ను చూసి, అలాంటి నిర్మాణాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో షాంఘై నగరంలో 'పెంటగోనల్ మాల్'ను చైనా నిర్మించింది. 70 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పంచముఖాకృతి గదులు, కాన్ఫరెన్స్ హాల్స్, మరెన్నో సౌకర్యాలతో 5 లక్షల చదరపు మీటర్లలో అతిపెద్ద షాపింగ్ మాల్ ను నిర్మించింది. మొదట్లో ఈ షాపింగ్ మాల్ ను చూసేందుకు, షాపింగ్ మాల్ లో ఏదో ఒకటి కొనాలనే కోరికతోను వినియోగదారులు క్యూకట్టేవారు. అయితే, ఈ షాపింగ్ మాల్ నిర్మాణం గజిబిజిగా ఉండడంతో, ఇక్కడికి వచ్చిన వినియోగదారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇది త్వరలోనే ఆదరణ కోల్పోయింది. వినియోగదారులు లేక దుకాణాలు ఈగలు తోలుకోవడం మొదలు పెట్టాయి. ఇలా ఆదరణ తగ్గడంతో ఇందులోని షాపులు కూడా ఖాళీ అయ్యాయి. ఇప్పుడు చైనాలో ఖాళీగా ఉంటున్న అతి పెద్ద షాపింగ్ మాల్ ఇదే!