: రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులెవరో తేల్చాలి: ప్రజాగాయకుడు గద్దర్
పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులెవరో తేల్చాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి ఆయన ఈరోజు వెళ్లారు. రోహిత్ ఆత్మహత్య బాధ్యులకు శిక్ష విధించాలని కోరుతున్న విద్యార్థులకు ఆయన మద్దతుగా నిలిచారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ, రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు యూనివర్శిటీలో పోరాటం ఆగదని అన్నారు. యూనివర్శిటీలు ఎలా ఉండాలో మేనిఫెస్టోలు తయారు చేయాలని ఆయన సూచించారు. కాగా, నలుగురు విద్యార్థులపై వర్శిటీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే, ఈ విషయాన్ని తమకు అధికారికంగా ఎవ్వరూ చెప్పలేదని సదరు విద్యార్థులు అంటున్నారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసే అధికారం తనకు లేదని వీసీ అప్పారావు నాడు చెప్పారని, మరి, ఈరోజు ఆ అధికారం తనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఆ విద్యార్థులు ప్రశ్నించడం గమనార్హం.