: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనుగొన్న మిస్సోరి వర్సిటీ బృందం


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాన సంఖ్యను అమెరికాకు చెందిన మిస్సోరి యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో కనుగొన్నారు. అదే 'ఎం74207281'. రెండు కోట్లకు పైగా అంకెలున్న ఈ సంఖ్య ప్రపంచంలోనే అతి పెద్ద ప్రధాన సంఖ్యని చెప్పారు. మిస్సోరి వర్సిటీలో కర్టీస్ కూపర్ ఆధ్వర్యంలో ఓ బృందం కంప్యూటర్ సాయంతో అతిపెద్ద మెర్సెనీ ప్రధాన సంఖ్యలు కనుగొనే పనిలో ఉంది. ఇందులో భాగంగానే గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెనీ ప్రైమ్ సెర్చ్ పేరుతో గ్లోబల్ సెర్చ్ నిర్వహించారు. అలా ఓ కంప్యూటర్ ఎం74207281 అనే సంఖ్యను ప్రధాన సంఖ్యగా కనుగొందని కూపర్ చెప్పారు. ఈ సంఖ్యను గుర్తించి ఆ బృందం సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకున్న అతిపెద్ద ప్రధాన సంఖ్య కంటె ఈ సంఖ్యలో 5 మిలియన్ల అంకెలు ఎక్కువగా ఉండటం విశేషమని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News