: మా కులంపై రాజకీయాలు చేస్తున్నారు: రోహిత్ తమ్ముడు
‘మా కులంపై రాజకీయాలు చేస్తున్నారు’ అని రోహిత్ తమ్ముడు మండిపడ్డాడు. తాము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్లమేనని, ఏదైనా అనుమానముంటే తమను కలిస్తే వివరణ ఇస్తామని అన్నాడు. పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల నేతలు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్శిటీని సందర్శించిన విషయం తెలిసిందే.