: ప్రపంచ అత్యుత్తమ హోటల్... జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్


రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ ప్యాలెస్ కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి లభించింది. 2016 సంవత్సరానికి ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ హోటల్ గా నిలిచింది. ట్రిప్ అడ్వయిజర్ వెబ్ సైట్ ఈ మేరకు 'ట్రావెలర్స్ చాయిస్ అవార్డు'ను ఈ ప్యాలెస్ కు ప్రకటించింది. అలనాటి రాచరికపు వైభవాన్ని కళ్లకు కట్టే అనుభవాన్ని, అనుభూతిని ఈ ప్యాలెస్ తమకు అందించిందని పర్యాటకులు తెలిపారు. అంతేకాకుండా 840 మంది అతిథులు ప్యాలెస్ కు 'ఐదుకు ఐదు' రేటింగ్ ఇచ్చి అగ్రస్థానంలో నిలబెట్టారు. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ వెబ్ సైట్ ట్రిప్ అడ్వయిజర్ తన 14వ ఎడిషన్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డును ఈ ప్యాలెస్ కు ప్రకటించింది.

  • Loading...

More Telugu News