: 'ఏఎస్ఏ' ఏర్పాటు చేయడం జాతి విద్రోహ చర్య కాదు: కేజ్రీవాల్


ఆశయ సాధన కోసం అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) ఏర్పాటు చేయడం జాతి విద్రోహ చర్యేమి కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్ సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటు పడేవాళ్లు మిగతా వారి కంటే మంచివారేనని, ఇలాంటి వారిని కేంద్రం గౌరవించాలని అన్నారు. అలా కాకుండా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ఆత్మహత్యలకు పురికొల్పడం చాలా బాధాకరమని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News