: న్యాయస్థానంలో కుమార్తెను వదిలి వెళ్లిపోయిన మహిళ
తన భర్త తనకు చెల్లించే మొత్తం ఎందుకూ సరిపోవడం లేదంటూ ఓ మహిళ ఏడాదిన్నర వయసున్న బాలికను న్యాయస్ధానంలో న్యాయమూర్తి ఎదుట వదిలి వెళ్లిపోయింది. కడపకు చెందిన భార్యాభర్తలు మనస్పర్థలు తలెత్తడంతో కొంత కాలం క్రితం అక్కడి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఆ దంపతులకు ఓ పాప ఉంది. దీంతో పాప పోషణ నిమిత్తం ప్రతి నెలా 3 వేల రూపాయలు చెల్లించాలని భర్తను న్యాయస్ధానం ఆదేశించింది. అయితే పాప పోషణకు ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని స్పష్టం చేసిన భార్య, పాపను న్యాయస్ధానంలో న్యాయమూర్తి ముందు వదిలేసి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న తండ్రి పట్టించుకోకపోవడంతో స్పందించిన న్యాయమూర్తి సీడబ్ల్యూసీ అధికారులకు బాలికను అప్పగించారు.