: డ్రగ్స్ సేవించి, గర్లఫ్రెండ్ తో వచ్చిన కొడుకు ఉన్మాదయ్యాడు!
డ్రగ్స్ సేవించి, గర్లఫ్రెండ్ ను వెంటబెట్టుకుని వచ్చిన కొడుకును ఇంట్లోకి రానివ్వకపోవడంతో అతను ఉన్మాదిగా మారాడు. విచక్షణ మరిచి కన్నతల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన అమ్మమ్మను హత్య చేశాడు ఆ కిరాతకుడు. ఈ దారుణ సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. లోయర్ ఆక్స్ ఫర్డ్ టౌన్ షిప్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... కెవిన్ హావ్లో(23) అనే యువకుడు మత్తు పదార్థాలు సేవించి, గర్ల ఫ్రెండ్ తో కలిసి ఇంటికి వెళ్లాడు. లోపలికి రావద్దంటూ అతని తల్లి అడ్డుచెప్పడంతో కెవిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దుర్మార్గపు కొడుకు బారి నుంచి ఎలాగో ఆమె తప్పించుకుని బయటపడింది. దీంతో, మరింత రెచ్చిపోయిన కెవిన్ తన అమ్మమ్మ అయిన ఎనభై ఏళ్ల వృద్ధురాలిపై దాడి, అత్యాచారయత్నం చేశాడు. తన నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ వృద్ధురాలిని కత్తితో పలుసార్లు పొడవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో అయోమయంలో పడ్డ కెవిన్ సోదరి వెంటనే పోలీసులకు సమాచారమందించింది. పోలీసులు అక్కడకి చేరుకుని కెవిన్ ని అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి జెర్మీ రిచర్డ్ పేర్కొన్నారు.