: రండి... తరలిరండి: 'లాక్ హీడ్' కంపెనీతో చంద్రబాబు


రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు విక్రయిస్తున్న లాక్ హీడ్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా అక్కడికి వచ్చిన లాక్ హీడ్ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుదీర్ఘ సముద్రతీరం లాక్ హీడ్ తయారు చేసే ప్రొడక్టుల సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు అనువుగా ఉంటుందని, ఎన్నో మైదాన ప్రాంతాలు ఉపరితల పరీక్షలకు అనువని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తే, అన్ని అనుమతులను, మౌలిక వసతులనూ సత్వరమే కల్పిస్తామని వెల్లడించిన ఆయన, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను లాక్ హీడ్ ప్లాంట్ల స్థాపనకు అనువైనవని సూచించినట్టు తెలిసింది. చంద్రబాబు ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన సంస్థ ప్రతినిధులు త్వరలోనే ఏపీలో పర్యటిస్తామని పేర్కొన్నట్టు సమాచారం. కాగా లాక్ హీడ్ యుద్ధ విమానాలు, వైమానిక అవసరాలకు పనికొచ్చే హెలికాప్టర్లు, తేలికపాటి, ఖండాంతర క్షిపణులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News