: 'బాహుబలి'కి వధువు కావలెను...గుణగణాలు ఇలా ఉండాలి: భల్లాలదేవ


'బాహుబలి' (ప్రభాస్)కి సోదరుడు భల్లాలదేవ (రానా) సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. ఈ మేరకు స్వయంవరం ప్రకటించాడు. తన సోదరుడికి తగిన వధువు కావాలని ఫేస్ బుక్ వేదికగా వెతుకులాట ప్రారంభించాడు. ఈ మేరకు వధువు గుణగణాలు ఎలా ఉండాలో వివరించాడు. 6.2 అంగుళాల ఎత్తున్న 36 ఏళ్ల 'బాహుబలి' ఇంట్లో భారీ పనులు సునాయాసంగా చేసేస్తాడని, మేకప్ స్వయంగా వేసుకోగలడని, అవసరమైతే భార్యకు కూడా మేకప్ వేయగలడని చెప్పాడు. యువతికి యుద్ధవిద్యల పట్ల ఆసక్తి ఉండాలని భల్లాలదేవ స్పష్టం చేశాడు. కత్తిసాము, విలువిద్య, మల్లయుద్ధంలో కిటుకులు బాగా తెలిసిన వ్యక్తి అయిఉండాలని రానా పేర్కొన్నాడు. ప్రస్తుతం కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తగారిని గౌరవంగా ఆమె చూసుకోవాలని సూచించాడు. ఇంటి పనుల్లోనే కాకుండా యుద్ధ పన్నాగాల్లోనూ భర్తకు సహకరించాలని, శత్రువును ఓడించేందుకు భర్తకు కొత్త కొత్త టెక్నిక్ లు నేర్పించాలని రానా తెలిపాడు. 'బాహుబలి'ని పెళ్లి చేసుకోబోయే ఆ రాకుమారి ఎవరో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News