: పఠాన్ కోట్ దాడి జరిపించింది నేనే: హిజ్బుల్ చీఫ్ సలావుద్దీన్
పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఈ నెల 2న జరిగిన ఉగ్రదాడికి తానే బాధ్యుడినంటూ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ప్రకటించుకున్నాడు. తాము రోటీన్ గానే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశామని, భారత్-పాక్ చర్చల ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో దాడి చేయలేదని చెప్పాడు. ఇదే సమయంలో కాశ్మీర్ పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీరును సలావుద్దీన్ తప్పుబట్టాడు. కాశ్మీరీల ఆక్రందనలు వినపడనట్టుగా షరీఫ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. 8 లక్షల మంది భారత సైనికులతో ముజాహిదీన్లు గత 26 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నారని, ఇందులో భాగంగానే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగింది తప్ప దానికి ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.