: చంద్రబాబు డైరెక్షన్, పోలీసుల యాక్షన్: జగన్ నిప్పులు
తమను రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వైకాపా నేతలను అరెస్టులు చేస్తున్నారని ఆ పార్టీ నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేసుల పేరుతో తమ పార్టీ వారిని లక్ష్యంగా చేసుకుంటూ నీచమైన రాజకీయాలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని దుయ్యబట్టారు. లోకేశ్ చేస్తున్న అవినీతిని అడ్డుకున్న కారణంతోనే మిధున్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులో మిధున్ రెడ్డి తప్పుంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ మేరకే వైకాపాపై కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. టీడీపీ ఆగడాలను ప్రజా క్షేత్రంలో అడ్డుకుంటామని జగన్ అన్నారు.