: కోల్ కతా మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు... బాంబు స్క్వాడ్ తనిఖీలు
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత బెదిరింపుల లేఖలు, ఫోన్ కాల్స్ సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ రాగా, తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని మెట్రో రైలు స్టేషన్ లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పరుగు పరుగున అక్కడికి వచ్చిన పోలీసులు రైల్వే స్టేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత బాంబు స్క్వాడ్ ను రప్పించిన పోలీసులు అణువణువూ తనిఖీ చేయిస్తున్నారు. మెట్రో స్టేషన్ లో బాంబు ఉందన్న వార్తల నేపథ్యంలో కోల్ కతాలో భయానక వాతావరణం నెలకొంది.