: బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై దాడి!


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో తమ నేతకు టికెట్ ఇప్పించలేదని ఆరోపిస్తూ, కొందరు కార్యకర్తలు ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. అసమ్మతి వర్గానికి చెందిన కొందరు స్థానికులు ఈ ఉదయం ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలో ప్రభాకర్ కారును అడ్డుకుని దాన్ని ధ్వంసం చేశారు. ప్రభాకర్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. ఈ విషయంలో తనపై దాడి జరిగిందని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

  • Loading...

More Telugu News