: కాపులపై రాజకీయ కుట్రలు: బొండా ఉమ
తెలుగు దేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న కాపులను దూరం చేసేందుకు కొన్ని విపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ విమర్శించారు. పలువురు కాపు నేతలు తమ స్వప్రయోజనాలు, రాజకీయ అస్థిత్వం కోసం కాపులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. టీడీపీలో కాపులకు ఉన్నంత గుర్తింపు మరే పార్టీలోనూ లేదని వెల్లడించిన బొండా ఉమ, ఏ రాష్ట్రంలోనూ జీవో ఆధారంగా ఓ కులానికి రిజర్వేషన్లు కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలని కాపులకు సూచించారు. కాపులకు రిజర్వేషన్లకై తాను కూడా డిమాండ్ చేస్తున్నానని, ఇతర కులాలకు అన్యాయం జరుగకుండా కాపులకు న్యాయం చేయాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు.