: నెల్లూరు సబ్ జైలులో పార్టీ నేతలను పరామర్శించిన జగన్
నెల్లూరు సబ్ జైలులో పార్టీ నేతలైన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. తిరుపతి ఎయిర్ పోర్టు మేనేజర్ పై దాడి కేసులో మిథున్ ను నాలుగు రోజుల కిందట చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్టు చేయగా, శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం నాటి కేసులో చెవిరెడ్డిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చడంతో ఈ నెల 29 వరకు ఆయనకు రిమాండ్ విధించారు.