: రాజధాని మాస్టర్ ప్లాన్ లో లోపాలు... సీఆర్ డీఏ కమిషనర్ కు అఖిలపక్షం వినతిపత్రం
నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ లో లోపాలపై అఖిలపక్ష నేతలు ఈ రోజు సీఆర్ డీఏ కమిషనర్ ను విజయవాడలో కలిశారు. మాస్టర్ ప్లాన్ లోపాలపై వినతిపత్రాన్ని సమర్పించారు. లోపాలపై అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాలు, ఇతర నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని వారు కమిషనర్ ను కోరారు. అభ్యంతరాలపై మార్చి నెలాఖరు వరకు గడువు పొడిగించాలని కోరారు. అంతేగాక మాస్టర్ ప్లాన్ కాపీని తెలుగులో ముద్రించాలని అఖిలపక్ష నేతలు డిమాండు చేశారు.