: ‘పఠాన్ కోట్’ దర్యాప్తు ముమ్మరం... గురుదాస్ పూర్, అమృత్ సర్ లలో ఎన్ఐఏ సోదాలు
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. నిన్నటిదాకా గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ ను రోజుల తరబడి విచారించిన ఎన్ఐఏ అధికారులు నేటి ఉదయం గురుదాస్ పూర్ సహా అమృత్ సర్ లలో విస్తృత సోదాలు ప్రారంభించారు. సల్వీందర్ సింగ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు చెందిన ఇళ్లల్లో తనిఖీలు చేశారు. సల్వీందర్ సింగ్ విచారణ సందర్భంగా వెలుగుచూసిన పలు అంశాల ఆధారంగానే సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.