: పఠాన్ కోట్ లోని భారత్- పాక్ సరిహద్దులో అనుమానిత వ్యక్తిపై కాల్పులు... మృతి
పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాలో ఓ అనుమానిత వ్యక్తిని సరిహద్దు భద్రత దళాలు కాల్చి చంపాయి. అక్కడి సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ నుంచి భారత్ లోకి కొంతమంది వ్యక్తులు గత రాత్రి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, వెంటనే బీఎస్ఎప్ జవాన్లు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరు తప్పించుకున్నారని చెప్పారు. చనిపోయిన అనుమానిత వ్యక్తి మృతదేహం సరిహద్దులో పాక్ వైపే ఉందని పేర్కొన్నారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.