: ఆన్ లైన్ ఫోన్ల అమ్మకాల్లో లెనోవా సరికొత్త రికార్డ్


ఆన్ లైన్ ఫోన్ల అమ్మకాల్లో లెనోవా ఫోన్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. అమెజాన్ ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన లెనోవా కె4 నోట్ మెడల్ ఒక్క సెకన్లోనే 10వేల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని లెనోవా ఇండియా ట్విట్టర్ లో వెల్లడించింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ ఇదే స్థాయిలో లెనోవా సంచలనాలను నమోదు చేసింది. కొంతకాలం ఈ మోడల్ మొబైల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అవకాశం కల్పించిన లెనోవా 4,80,566 రిజిస్టేషన్లను స్వీకరించింది. 3జీబీ రామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి అధునాతన ఫీచర్స్ తో హై ఎండ్ మొబైల్ గా రూపొందిన లెనోవా కె4 ధర రూ.12,499. ఇప్పటివరకు అమెజాన్ ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ను ఈ నెల 5న భారత మార్కెట్ లోకి విడుదల చేశారు. 19 నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News