: అక్కడ 'కప్పు సాసర్'కు భలే క్రేజు!


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రెబల్ అభ్యర్థులంతా ఇప్పుడు ఓ గుర్తు కోసం తెగ పోటీపడుతున్నారు. అదే 'కప్పు సాసర్' గుర్తు! ఈ గుర్తు వస్తే ఇక గెలపు కూడా తమదేనని అభ్యర్థులు చాలా ధీమాతో ఉన్నారు. ఎన్నో గుర్తులుండగా వారంతా దానికోసమే ఎందుకలా పోటీపడుతున్నారంటే దీనికో ప్రత్యేకత ఉంది మరి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూన శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 24వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. అప్పట్లో ఆయన ఎన్నికల గుర్తు కప్పు సాసర్. దాంతో ఆ గుర్తుకు ఆ నియోజకవర్గంలో మాంచి క్రేజ్ వచ్చేసింది. అందుకే స్వతంత్రులుగా పోటీ చేస్తున్నవారంతా అదే గుర్తు కావాలని పోటీ పడుతున్నారు.

  • Loading...

More Telugu News