: చిచ్చరపిడుగు వస్తున్నాడోచ్


ఒక్క ఇన్నింగ్స్.. ఢిల్లీ యువ కిశోరం శిఖర్ ధావన్ ను ప్రపంచ స్థాయి హార్డ్ హిట్టర్స్ సరసన కూర్చుండబెట్టింది. ఆస్ట్రేలియాపై మొహాలీ టెస్టులో ధావన్ చేసిన 187 పరుగులు ఆసీస్ కు మ్యాచ్ ను దూరం చేశాయి. దీంతో, అందరి దృష్టి ఈ మీసాలరాయుడిపై పడింది. బంతిని బలంగా బాదడమే కాదు, చక్కని ప్లేస్ మెంట్ తో ఫీల్డర్ల మధ్య ఖాళీల్లోంచి బంతిని దొర్లించడమూ ధావన్ కు చేతనవును. ఆ సిరీస్ లో చేతివేళ్ళకు గాయమవడంతో చికిత్స తీసుకుని కోలుకున్న ధావన్ ఇప్పుడు ఐపీఎల్ లో తన సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధావన్ ఐపీఎల్-6లో నేడు తొలి మ్యాచ్ ఆడనున్నాడు. సూపర్ కింగ్స్ తో చెన్నైలో జరిగే ఈ మ్యాచ్ కు రాజకీయ కారణాలతో లంక ఆటగాళ్ళు కెప్టెన్ కుమార సంగక్కర, ఆల్ రౌండర్ తిసర పెరీరాలు దూరమయ్యారు. దీంతో, టాపార్డర్ లో బ్యాటింగ్ భారం ధావన్ పై పడింది. కాగా, ధావన్ రాకపై సన్ రైజర్స్ సలహాదారు కృష్ణమాచారి శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ధావన్ అడుగుపెట్టడంతో జట్టు బ్యాటింగ్ బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News