: ఇంటర్వ్యూ కోసమెళ్లిన లేడీ జర్నలిస్ట్ ముక్కు పచ్చడి చేసిన గోద్రా అల్లర్ల దోషి


నిజమే... దేశవ్యాప్తంగా కలకలం రేపిన దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని లోతైన విషయాలను వెలుగులోకి తెద్దామనుకున్న ఓ లేడీ జర్నలిస్ట్ కు గోద్రా అల్లర్ల నిందితుడు చుక్కలు చూపాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని బుద్ధిగా కూర్చున్న వాడు, కొద్దిసేపటికే లేచి నిలబడి ఆ మహిళా విలేకరి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ముక్కును పచ్చడి చేశాడు. ఈ ఘటన నిన్న గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... గోద్రా అల్లర్లలో భాగంగా ముస్లింల కుగ్రామం నరోదా పటియాపై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన సురేశ్ ఛారా అహ్మదాబాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. నాటి దారుణ ఘటనలకు సంబంధించి వెలుగు చూడని మరిన్ని అంశాలను బయటకు తీసుకురావాలన్న సదాశయంతో లేడీ జర్నలిస్ట్ రేవతి లాల్ ఓ పుస్తకం రాస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల నుంచి అనుమతి తీసుకుని మరీ సురేశ్ చారాను ఆమె కలిశారు. ప్రశ్నలకు సమాధానం చెబుతానని వచ్చిన సురేశ్... ఐదు నిమిషాలు గడిచాయో, లేదో... కూర్చున్న వాడు లేచి నిలబడ్డాడు. రేవతి ప్రమాదాన్ని శంకించేలోపే ఆమె ముఖంపై అతడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో రేవతి ముఖం చితికిపోయింది. ముక్కు పచ్చడైంది. ఆ తర్వాత సురేశ్ పై రేవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News