: అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ షురూ... భారీ డిస్కైంట్లు ఆశించేవారికి నిజంగా పండగేట!
ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ సరికొత్త బంపర్ ఆఫర్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ నిన్న రాత్రి సరిగ్గా 12 గంటలకు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు (72 గంటలు) వినియోగదారులకు అందుబాటులో ఉండే ఈ భారీ డిస్కౌంట్ల ‘సేల్’ పండగ ఈ నెల 23 (అర్ధరాత్రి 12 గంటల)తో ముగియనుంది. వందలాది కేటగిరీలకు చెందిన లక్షలాది ఉత్పత్తులను అమెజాన్ భారతీయ వినియోగదారులకు అందించేందుకే ఈ బంపరాఫర్ ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘పెహ్లె యాప్’తో వినియోగదారులు మరింత సులభరీతిలో తమకు ఇష్టమైన వస్తువులను ఇతరులతో పోటీ లేకుండానే కొనేయొచ్చని అమెజాన్ వెల్లడించింది. 40 మల్టీ నేషనల్ బ్రాండ్లపై 30 శాతం డిస్కౌంట్లు లభించనున్న ఈ సేల్ లో సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో 10 శాతం క్యాష్ బ్యాక్ కూడా అందనుందట.