: ఆఫ్గన్ లో తొలి యుద్ధానికి సిద్ధమైన భారత ఎంఐ-35


ఆఫ్గనిస్థాన్ లో శాంతిని పరిరక్షిస్తూ, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం అందించిన మల్టీరోల్ ఎంఐ-35 హెలికాప్టర్లను ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మోహరించినట్టు అధికారులు తెలిపారు. గత నెలలో ఇండియా నుంచి 4 ఎంఐ-35లు రాగా, వాటిల్లో మూడింటిని ఏ క్షణమైనా టేకాఫ్ కు సిద్ధంగా ఉంచామని ఆఫ్గన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఇండియా మాకు అనునిత్యమూ సహకరిస్తోంది. ఇండియా ఇచ్చిన ఫైటర్ హెలికాప్టర్లను ఉగ్రవాదులపై పోరుకు వినియోగిస్తాం" అని రక్షణ శాఖ ప్రొక్యూర్మెంట్ విభాగం డిప్యూటీ చీఫ్ గులామ్ అహ్మద్ జాయ్ వెల్లడించారు. భారత సహకారానికి కృతజ్ఞతలని తెలిపారు. ఉపఖండ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా వీటిని నిర్మించారని, ఇవి ఆఫ్గన్ వాతావరణానికి సరిగ్గా నప్పుతాయని ఆయన అన్నారు. భారత్ తో పాటు అమెరికా సైతం తాలిబాన్లు, దయేష్, అల్ ఖైదా ఉగ్ర సంస్థలను నిలువరించేందుకు సహకరిస్తోందని అన్నారు. ఆఫ్గన్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి ఈ హెలికాప్టర్లు సేవలందించనున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News